4 June, 2026 | 2:54 AM

భూతగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారికి కౌన్సెలింగ్ ఇవ్వండి

04-06-2026 02:05 AM

వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

హనుమకొండ, జూన్ 3 (విజయక్రాంతి): భూతగాదాల కేసుల్లో మధ్యవర్తిత్వ వహిస్తూ సెటిల్మెంట్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులను అదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవా రం కెయూసి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.

పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ఏసిపి నర్సింహరావు, ఇన్స్సె్పక్టర్ రవికుమార్ పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగ తం పలికాలికారు. పోలీస్ కమిషనర్ ముం దుగా స్టేషన్ పరిసరాలు, స్టోర్, కేసు ప్రాపర్టీగదులు, స్టేషన్ పరిధిలోని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, బాలమిత్ర పోలీస్ స్టేషన్ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు.

అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ సంబంధించిన రికార్డులను, రౌడీ షీటర్లు, అనుమానితుల రికార్డులను పరిశీలిస్తూ, పో లీస్ స్టేషన్ పరిధిలో యాక్టివ్గా వున్న రౌడీ షీ టర్లు, అనుమానితులు ఎవరు, ప్రస్తుతం వా ళ్ళు ఎలావున్నారు,ఏం చేస్తున్నారు మొదలై న వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడు తూ తగాదాల్లో తలదూర్చే రౌడీ షీటర్లతో పాటు బెదిరింపులకు పాల్పడే వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వాలని, రౌడీ షీటర్లపట్ల సానుభూతి ధోరణి ప్రదర్శించవద్దని, యాక్టివ్గా వున్న రౌడీపై నజర్ పెట్టాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా, ముఖ్యంగా స్థానికంగా వున్న సామాజిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, విద్యా సంస్థల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనలపై ము మ్మరంగా అవగాహన  కార్యక్రమాలు నిర్వహించాలని, స్టేషన్ ఎస్.ఐలు అప్పగించిన సెక్టార్ పరిధిలో నేరాల నియంత్రించడంతో పాటు, ముందస్తూ సమాచారాన్ని సేకరించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమములో కె యు పోలీస్ స్టేషన్ ఎస్.ఐలు నవీన్ కుమార్, కళ్యాణ్ కుమర్, రాజమౌళి తదితరులు పాల్గోన్నారు.