27 July, 2026 | 2:27 AM

జ్ఞానం దిశను చూపిస్తే.. అనుభవమే నిజమైన అభ్యసనాన్ని తీర్చిదిద్దుతుంది

27-07-2026 01:57 AM
  1. ఘనంగా బిట్స్ పిలాని స్నాతకోత్సవం              
  2. బిగ్ బాస్కెట్ సహా వ్యవస్థాపకులు శ్రీహరి మీనన్                        

జవహర్‌నగర్, జూలై 26 (విజయక్రాం తి): జ్ఞానం దిశను చూపిస్తే అనుభవమే నిజమైన అభ్యసనాన్ని తీర్చిదిద్దుతుందని బిగ్ బాస్కెట్ సహా వ్యవస్థాపకులు శ్రీహరి మీన న్ పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌లో ఆదివారం 2026 వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా బిగ్ బాస్కెట్ సహా వ్యవస్థాపకులు శ్రీహరి మీనన్ హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు సవాళ్లను ధైర్యంగా స్వీకరించాలని అర్థవంతమైన సంబంధాలను విలువైనవిగా భావించాలని అలాగే చిరస్థాయి విజయం మంచి వ్యక్తిత్వం నిరంతర అభ్యాసనం తప్పుల నుండి నేర్చుకొని ఎదగాలని ఇవన్నీ ధైర్యం మీదే ఆధారపడి ఉంటుందని విద్యార్థులకు తెలిపారు.

అనంతరం పట్ట బద్రుల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రొఫెసర్ ధర్మరాజన్ శ్రీరామ్ విద్యార్థుల సాధించిన విజయా లకు అభినందనలు తెలియజేస్తూ వారి తల్లిదండ్రులు ఆధ్యాపకులు మార్గదర్శకులు అం దించిన అచంచలమైన సహకారాన్ని ప్రసవించారు. బిట్స్ పిలానీలో విద్య కేవలం విద్య ప్రావీణ్యత కే పరిమితం కాదని నిజాయితీ ఆవిష్కరణత్మక ఆలోచన సంకల్పబలం సమాజంలో సార్ధకమైన మార్పు తీసుకురావాలని  భద్రత కలిగిన వ్యక్తులను తీర్చి దిద్దుతుందని పేర్కొన్నారు.

జీవితాం తం నేర్చుకుంటూ ఉండాలని సవాళ్లను ఆత్మవిశ్వాసంతో స్వీకరించాలని వినయంతో అత్యుత్తమ భవిష్యత్తును సాధించాలని మ రింత సమానత్వం స్థిరత్వం సాంకేతిక పురోగతి కలిగిన భవిష్యత్తు నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పట్టభద్రులకు సూచించారు. ఈ సందర్భంగా మొత్తం 1500 మంది విద్యార్థులకు  పట్టాలు ప్రదా నం చేశారు. వీరిలో 1200 మందికి పైగా ఫ స్ట్ డిగ్రీలు, సుమారు 200 మందికి హయ్య ర్ డిగ్రీలు, 100 మందికి పీహెచ్డీ పట్టాలు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బిట్స్ పిలాని 2026 బ్యాచ్ పట్టభద్రులకు అభినందనలు తెలియజేస్తూ బిట్స్ పిలాని సంస్థ వారు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ఈ విద్యార్థులు బిట్స్ పిలాని యొక్క గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా విద్యారంగం పరిశ్రమలు వ్యవస్థాపక ప్రజాసేవ పరిశోధన రంగాల్లో విశిష్టమైన సేవలు అం దించాలని ఈ సందర్భంగా బిట్స్ పిలాని ఇన్స్టిట్యూషన్ పునరు ద్గాటించింది. కార్యక్రమంలో బిట్స్ పిలాని వైస్ ఛాన్సర్ ప్రొఫెసర్ వి.రామ్ గోపాల్ రావు, బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఇన్చార్జ్ ప్రొఫెసర్ ధర్మరాజన్ శ్రీరా మ్, గవర్నర్ల మండలి సభ్యులు, సెనేట్ స భ్యులు, ఆధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.