06-12-2024 12:11:21 AM
కేంద్ర మంత్రికి ఎంపీ వినతి
నల్లగొండ, డిసెంబర్ 5 (విజయక్రాంతి): నాగార్జునసాగర్‌ను పర్యాట కంగా అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షకావత్‌ను నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి కోరారు. ఢిల్లీలో గురువారం మంత్రిని కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. మంత్రి నిధుల విడుదలకు సుముఖత వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో పర్యాటక కేంద్రాలైన పానగల్, రాచకొండ, దేవరకొండ ఖివరకొండ ప్రాముఖ్యతను కేంద్ర మంత్రికి ఎంపీ వివరించారు.