06-12-2024 12:11:44 AM
కామారెడ్డి, డిసెంబర్ 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగు చూసింది. కా మారెడ్డి జిల్లా బిచ్కుందలో కాంట్రాక్ట్ ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న శిరీష(28) కామారెడ్డిలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త స్వామి దుబాయ్‌లో ఉంటున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు శ్రీమణి, ఆద్య ఉన్నారు. బుధవారం ఉద్యోగానికి వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాలేదు. గురువారం కామారెడ్డి భూ పుత్రమ్మ కళ్యాణ మండప రేకుల షెడ్డులో శిరీష ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృ తురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ప ట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.