మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి
నూతనకల్, నవంబర్ 11: మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతో పాటు, నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సునీత ఆదేశించారు.ఆమె తాళ్లసింగారం గ్రామ పంచాయతీలోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాలలో మధ్యాహ్న భోజనం తయారీ ప్రక్రియను, నాణ్యతను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే విషయంలో ఎటువంటి అశ్రద్ధా వహించరాదని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. భోజనం నాణ్యత విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపురం గ్రామ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలలో
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),నవంబర్11: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్ మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు.
ఎంపీడీఓ ఝాన్సీతో కలిసి మంగళవారం మండలంలోని తిమ్మాపురం గ్రామ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు గ్రామంలోని 3అంగన్వాడీ కేంద్రాలు అడివెంల గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. గిర్దవార్ జలంధర్ రావు, కాంప్లెక్స్ హెచ్‌ఎం కుంభం ప్రభాకర్, పీఎస్ హెచ్‌ఎం లింగమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




