calender_icon.png 12 November, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభం

12-11-2025 12:00:00 AM

అయిజ, నవంబర్ 11 : ఎస్ జి ఎఫ్ జిల్లాస్థాయి అండర్ 14 మరియు అండర్ 17 బాస్కెట్ బాల్ క్రీడా పోటీలు మంగళవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం లో నిర్వహించారు.  జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని జోనల్ స్థాయికి ఎంపిక కావడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఏ సోమశేఖర్ రెడ్డి ,జోగులాంబ గద్వాల్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు పులకుర్తి రామచంద్ర రెడ్డి, జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీ నాగేష్ మండల సబ్ ఇన్స్పెక్టర్ 2 తరుణ్ రెడ్డి పాల్గొని బాస్కెట్ బాల్ క్రీడా పోటీలను ప్రారంభించారు.