18-07-2025 01:06:16 AM
డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి
కుమ్రంభీం ఆసిఫాబాద్, జులై 17 (విజ యక్రాంతి): ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులుకు నాణ్యమైన, రుచికరమైన ఆహారా న్ని అందించాలని గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ ఆర్ రమాదేవి సూచించారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్ మ్యాట్రిక్ బాలికల వసతి గృహంలో గురువారం ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న వంట మనుసులుకు ఒక్క రోజు వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
వసతిగృహ పరిసరాలలో శుభ్రతతో వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, విద్యార్థులకు నిర్ణత సమయంలో భోజనం అందిం చాలన్నారు. టమాటాలు, ఆలుగడ్డలు త్వర గా చెడిపోయే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. వర్షకాలం అంటూ వ్యా ధులు ప్రబల కుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పీఏం ఆర్‌సీఏసీఎంవో పూర్కా ఉద్దవ్, ఏటీడీవోలు చిరంజీవి, శ్రీనివాస్, జీసీడీవో శకుంతల, స్థానిక ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడ్మేత జంగు, వార్డెన్ సాయి, అలీ, అశోక్, ఆరోగ్య కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.