27 March, 2026 | 1:42 AM

విలువలతో కూడిన విద్యనివ్వండి

27-03-2026 12:03 AM

చేవెళ్ళ, మార్చి 2౬(విజయక్రాంతి): విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని చేవెళ్ల ఎంఈఓ పురం దాస్ అన్నారు. చేవెళ్ళలో పల్లవి కిడ్స్ స్కూల్ నిర్వహించిన వసుదైక కుటుంబమనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డితో కలిసి పాల్గొని ప్రశాంగించారు. విద్యాసంస్థలు విద్యార్థుల్లోని సృజనాత్మకత వెలికితీసి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని చెప్పారు. పుస్తక పఠనంతోపాటు క్రీడలు సాంకేతిక పరిజ్ఞానంపై అవసరమన్నారు.

క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం భవిష్యత్కు పునాదన్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... అందరికి ఆనందానిచ్చే ఈ పోగ్రాం ఆలోచన గొప్పదన్నారు. ముఖ్యంగా ప్రకృతి పట్ల విద్యార్థులకు అవగాహణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్తులకు ఎంఈఓ మున్సిపల్ చైర్మన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బరీరా ఖాతూన్, కరస్పాండెంట్ శ్రీకాంత్, డైరెక్టర్ క్రాంతి కుమార్, నవాజ రెడ్డి, మనోహర్ రెడ్డి, శేఖర్, ఆంజనేయులు, మాణిక్యం, గోపాల్, ఉపాధ్యాయ బృందం, పేరెంట్స్ పాల్గొన్నారు.