calender_icon.png 9 July, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సహాయం అందజేత

09-07-2025 12:00:00 AM

ఆర్మూర్, జులై 8 : ఇజ్రాయేల్ దేశంలోని తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు తోటి మిత్రుని కూతురు చికిత్స కోసం మంగళవారం 3.70 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఇశ్రాయేలు తెలంగాణ అసోసియేషన్ మాజీ సభ్యుడు అరుణ్ శర్మ కొన్నేళ్లు ఇజ్రాయిల్ లో జీవనోపాది పొంది ఆరు నెలల క్రితం ఇండియా తిరిగి వచ్చాడు. ఎంబీబీఎస్  చదువుతున్న చిన్న కూతురు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయి రెండు నెలలుగా జూబ్లీహిల్స్ లో ఉన్న అపోలో హాస్పిటల్ లో కోమాలో ఉండి చికిత్స పొందుతోంది.

చికిత్స కోసం ఆర్థికంగా అండగా నిలవడానికి ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్  తరపున సభ్యులు సమకూర్చిన రూ 3.70 లక్షల చెక్కును తెలంగాణ ఎన్నారై అడ్వుజర్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్,  వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి, సభ్యులు నంగి దేవేందర్ రెడ్డి, ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు సోమరవిలు హైదరాబాదులోని హాస్పిటల్ వెళ్లి అందజేశారు.