calender_icon.png 9 July, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హమీ సిబ్బందికి జీతాలేవీ?

08-07-2025 11:41:08 PM

మాజీమంత్రి హరీశ్‌రావు..

హైదరాబాద్ (విజయక్రాంతి): చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హమీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారమై సతమతమవుతుంటే ఈ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దుర్మార్గమని ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎంవో, డిప్యూటీ సీఎం భట్టి, తెలంగాణ సీఎస్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరమన్నారు.

మరోవైపు పారిశుధ్య కార్మికులకు కూడా వేతనాలు రాక గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందని, ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని హరీశ్‌రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధి హామీ ఏపీవోలు, పారిశుధ్య కార్మికుల పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.