calender_icon.png 9 January, 2026 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సాయం అందజేత

06-01-2026 12:02:50 AM

చిన్నంబావి, జనవరి 5: మండల పరిధిలోని వెలగొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాగరాజు కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త కళ్యాణ్ కుమార్ వెంటనే స్పందించి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. ఇట్టి నగదు మొత్తాన్ని మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు   గంగారిశ్రీనివాసులు, రామకృష్ణ, సుధాకర్, జగదీష్  బాధిత కుటుంబానికి అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.