06-01-2026 12:01:29 AM
187 దరఖాస్తులు
కరీంనగర్, జనవరి 5 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. కరీంనగర్ నగరపాలక సంస్థలు 66 డివిజన్లో ఉండగా ఓటర్ జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. సోమవారం ఒక రోజే 11 1 దరఖాస్తులు వచ్చాయి.ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలుపుతూ మొత్తం 187 దరఖాస్తులు వచ్చాయి. ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని, ఓట్లు గల్లంతయ్యాయని, ఒక డివిజన్ నుండి మరొక డివిజన్ కు ఓటర్లు మారారని, డబుల్ ఓటర్లు వచ్చారని, చనిపోయిన వారి పేరు కూడా ఓటరు జాబితాలో వచ్చాయని అభ్యంతరాలు వచ్చాయి.
వీటిపై వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాలు, కార్పొరేటర్ పోటీ చేయాలనుకునే ఆశావాహ అభ్యర్థులు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో అభ్యంతరాలను తెలుపుతూ దరఖాస్తులను అందజేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ఓటర్ల జాబితా సరి చేయాల, దొంగ ఓట్లను తొలగించాలని, డివిజన్ పరిదిలో పోలింగ్ బూత్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. అలాగే దుర్శేడ్ డివిజన్ నాయకుడు సుంకిశాల సంపత్‌అవు టరు జాబితా తప్పుల తడకగా ఉందని, సమగ్ర విచారణ చేపట్టి ఓటరు జాబితాను సవరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
రేకుర్తిలోని 18, 19 డివిజన్ల ఓటర్ లిస్టులో ఓటర్లు వివిధ డివిజన్లకు మారారని, వెంటనే సవరించాలని కోరుతూ దుర్గం మారుతి, వెంట పిట్టల సత్యనారాయణ, హస్తపురం అంజయ్య, గోదారి చంద్రయ్య, జి బాలకృష్ణలు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. చాలా డివిజన్లు భౌగోళికంగా అస్తవ్యస్తంగా ఉన్నాయని, వెంటనే ఓటర్ల జాబితా సవరించాలని కోరుతూ పూలే బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అయిలన్న, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిగుర్ల శ్రీనివాస్‌లు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
తుది ఓటరు జాబితా తయారు చేస్తాం
తమ దృష్టికి తెచ్చిన అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి... ఫైనల్ ఎలక్ట్రోరల్ రోల్స్ జాబితా తయారు చేస్తామని... కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిద రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.... నగరపాలక సంస్థ ప్రచురించిన 66 డివిజన్ల ఎలక్ట్రోరల్ రోల్స్ జాబితా పై ఆదివారం వరకు 53 అభ్యతరాలను స్వీకరించామన్నారు.
వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీస్కోని క్షేత్ర స్థాయిలో ప్రతి ఓటర్ ను పరిశీలిస్తామని తెలిపారు. వార్డు ఆఫీసర్లతో పాటు బిఎల్ ఓ లను కూడ ఈ ప్రక్రియలో భాగం చేసి... డివిజన్ల వారిగా ఓజర్లను సవరణ చేసి తుది జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. తదనంతరం ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి షెడ్యూల్ ప్రకారం పోలీంగ్ బూత్ వారిగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.