15-07-2025 12:00:00 AM
ఘట్ కేసర్,జూలై 14 : పోచారం మున్సిపల్ వెంకటాపూర్ లోని అనురాగ్ విశ్వవి ద్యాలయంలో ‘సైకాలజిస్ట్స్ అప్రిసియేషన్ డే‘ కార్యక్రమాన్ని సోమవారం ఎంతో ఘ నంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా ఏపిఏఐ గ్రేటర్ హైదరాబా ద్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సి. వీరభద్రరావు రెడ్లా, ఏపిఏఐ జాతీయ ఉపాధ్యక్షులు మో హన్ దేశ్ పాండే విచ్చేసారు. గౌరవ అతిథిగా రిహాబిలిటేషన్ సైకాలజిస్టు గంగాధర్ బారెడ్డి పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగం శాఖధిపతి డాక్టర్ పి. స్వాతి తమ ముఖ్య ప్ర సం గాన్ని అందించారు.కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ మహిపతి శ్రీనివాసరావు స్వాగతంతో ప్రారంభించారు. అనం తరం ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేట ర్ డాక్టర్ సి. మల్లేశ, డాక్టర్ సి. వీరభద్ర రావు రెడ్లా, గంగాధర్ బారెడ్డి తమ విలువైన అభిప్రాయాలను సైకాలజిస్టులతో పంచుకున్నా రు.
మోహన్ దేశ్ పాండే ప్రపంచ సైకాలజిస్ట్స్ అప్రిసియేషన్ డే ప్రాముఖ్యతపై చక్కటి ప్రసంగం అందించారు. ఈసందర్భంగా ‘సైకాలజిస్ట్స్ ఆఫ్ ది ఇయర్‘ అవార్డులు 15 మంది ప్రతిభావంతమైన సైకాలజిస్టులకు అతిథుల చేతుల మీదుగా ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏపీఏఐ రాష్ట్ర అధ్యక్షురాలు రేణుక లింగాల, కా ర్యనిర్వాహక అధ్యక్షుడు కృష్ణ భరత్ పాల్గొన్నారు.