calender_icon.png 15 July, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు బడులపైనే.. ప్రేమ ఎందుకో..?

15-07-2025 12:00:00 AM

- ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు

-విద్య హక్కు చట్టం బుట్ట దాతలు

- సదుపాయాలు లేకున్నా..  ఫీజు మాత్రం లక్షల్లో..

నిర్మల్, జూలై 14(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలపై ఫిర్యాదులు వస్తున్న సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు విలవిస్తున్నాయి. విద్య వ్యాపారమైన ఈ రోజుల్లో కార్పొరేట్ సంస్థలు అమాయక తల్లిదండ్రులను కనికట్టు చేస్తూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి పిల్లల భవిష్యత్తుతో ఆలాడుకుంటున్నారు.

నిర్మల్ జిల్లాలోని బైంసా నిర్మల్ ఖానాపూర్ ముధోల్ బాసర పట్టణాలతో పాటు ఆయా మండలాలు గ్రామాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలో విద్యాశాఖ నిబంధనలను విస్మరిస్తూ విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ కు చెందిన ఓ కార్పొరేట్ విద్యా సంస్థ గత ఏడాది నిర్మల్ జిల్లాలో విద్యా సంస్థను ప్రారంభించినప్పటికీ రెండేళ్ల క్రితం ప్రారంభంట్లు టీసీలు బోనాఫైలు విద్యార్థులకు జారీ చేయడం పై చర్చ జరుగుతుంది.

ఈదిగామ్ చౌరస్తా వద్ద ఉన్న ఈ పాఠశాల అనుమతులు లేకుండానే పదో తరగతి వరకు చదివినట్టు విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇచ్చినట్టు ట్రస్ట్ మా సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విద్యా సంస్థలు కార్పొరేట్ పేరుతో లక్షలాది రూపాయలను ఫీజుల రూపంలో తల్లిదండ్రుల వద్ద నుండి వసూలు చేస్తున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. ఆధారులతో సహా ఇప్పటికే మూడుసార్లు నిర్మల్ ట్రస్ట్ మా జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన స్పందన కరువైంది.

నర్సాపూర్ మండలంలోని ఓ గ్రామంలో మిషనరీ స్కూల్ లో ఇదేవిధంగా వివరిస్తున్నారు. నిర్మల్ పట్టణంలో ప్రైమరీ వరకు అనుమతులు ఉన్న యుపిఎస్ వరకు విద్యా కొనసాగిస్తుండగా కొన్ని పాఠశాలలో టెన్త్ వరకు విద్యాబోధన చేస్తున్నారు అనుమతి లేని పాఠశాలలపై చర్య తీసుకోవాలని ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూ జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందించారు

వసతులు లేకున్నా ఫీజులు లక్షల్లో..

నిర్మల్ జిల్లాలో ప్రవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి వసతులు లేకపోయినా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరు పనులు వస్తున్నాయి. నిర్మల్ పట్టణంలోని మూడు స్కూళ్లకు ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వహిస్తుండగా పైసలు రెండు ఖానాపూర్ లో రెండు మరో 16 మండలాలు 8 వరకు స్కూలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అనుమతి పొందిన పాఠశాలలో విద్యా కు చట్ట ప్రకారం ట్రైన్ టీచర్లు ఉండాలి నిబంధన ఉన్న ఇంటర్ వారితో బోధన చేస్తున్నారు.

విద్యార్థి విద్యనులకు సరిపోని తరగతి గదులు మూత్రశాలలు మరుగుదొడ్లు లేకపోవడం డైనింగ్ హాల్ వెయిటింగ్ ఆల్ లేకపోయినా హాస్టళ్లు స్కూల నిర్వహణ చేస్తూ అమాయక తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందికి గురిచేస్తున్నారు. కొన్ని పాఠశాలకు కనీసం క్రీడాలు కూడా లేవని విద్యార్థి సంఘాలు తెలిపాయి. గురుకుల నవోదయ సైనిక్ స్కూల్ ప్రవేశాల పేరుతో కొన్ని పాఠశాలలు అనుమతి లేకుండా కోచింగ్ నిర్వహిస్తూ హాస్టల్లో పిల్లలను ఉంచుకొని లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

పాఠశాలలోని పుస్తకాలు కాపీలు బూట్లు ఇతర సామాగ్రి కొనుగోలు చేసేందుకు ప్రత్యేక దుకాణాలను కౌంటర్లను ఏర్పాటు చేసి వారు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేసేలా తల్లిదండ్రుల పై ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాల నిర్వహణను పర్యవేక్షించిన జిల్లా విద్యాశాఖ అధికారులు వ్యక్తిగతంగా ఫిర్యాదులు వస్తే తప్ప ప్రైవేట్ పాఠశాలలను తలుపు చేసే దాఖలు లేవని తనిఖీల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు కూడా విలువస్తున్నాయి. పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ కి ఇప్పటికైనా చెరువు చూపి అనుమతి లేని పాఠశాలలపై చర్య తీసుకోవాలని వారు కోరుతున్నారు