కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి
04-08-2025 06:45 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav), అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించిన కలెక్టర్ వాటిని వాటిని సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఇప్పటివరకు పరిష్కరించిన దరఖాస్తులు పెండింగ్ దరఖాస్తులపై జిల్లా అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకుందామని దరఖాస్తుల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి జిల్లా అధికారులు పాల్గొన్నారు.






