calender_icon.png 4 August, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ కు అభినందనల వెల్లువ

04-08-2025 06:42:40 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆదివాసి, గిరిజనుల సంక్షేమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను అత్యున్నత స్థానంలో నిలిపినందున జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre)ను జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావులు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గల రాజ్ భవన్ లో సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించినందున గవర్నర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పురస్కారం తీసుకున్న సందర్భంగా కలెక్టరేట్ లోని అన్ని విభాగాల పర్యవేక్షకులు, సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి కిరణ్ కుమార్, అన్ని విభాగాల పర్యవేక్షకులు ఉద్యోగులు పాల్గొన్నారు.