25-12-2025 12:10:04 AM
మొత్తం ఆదాయం రూ.42,25,555
అమీన్‌పూర్, డిసెంబర్ 24 : అమీన్ పూర్ మండలం బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాం గణంలో బహిరంగ వేలం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేలాన్ని దేవస్థానం ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, మొత్తం రూ.42,25,555 ఆదాయం లభించింది. వివరాలు కొబ్బరికాయల వేలం రూ.11,05, 000లకు శ్రీకాంత్ రెడ్డి దక్కించుకున్నారు. లడ్డు, పులిహోర వేలం రూ.9,90,000లకు చంద్రశేఖర్ దక్కించుకున్నారు. కొబ్బరి చిప్ప ల వేలం రూ.2,55,000లకు రామారావు దక్కించుకున్నారు,
జాయింట్ వీల్ వేలం రూ.17,25,000లకు రత్నం దక్కించుకున్నారు, థాయ్ బజార్ వేలం రూ.1,50, 555లకు నరసింహ చారి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ రెడ్డి, సోమేశ్, శివకుమార్తో పాటు ధర్మకర్త మండలి సభ్యులు చంద్రశేఖర్, లక్ష్మీకాంతరావు, నిర్మ ల రమేష్ యాదవ్, ఎల్లయ్య, మల్లేష్ యా దవ్, శ్రీనివాస్, కుమ్మరి మహేష్, దీపక్ గౌడ్, దేవాదాయ శాఖ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.