11 April, 2026 | 6:04 PM

Breaking News

నూతన ఎస్ఐ మహేందర్ ను సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం నేతలు   •   కామారెడ్డిని క్రీడల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వము అడుగులు   •   క్రీడలతో మానసిక ఉల్లాసం స్నేహభావం పెంపొందుతుంది   •   కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు 11వ వర్ధంతి   •   భాగిర్తిపల్లిలో అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాశన, అక్షరాభ్యాసం   •   సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే   •   అక్షరాయుధంతో అణచివేతపై పోరాడిన ధీశాలి పూలే   •   జెక్ కాలనీలో చలివేంద్రం ప్రారంభం   •   తల్లి జ్ఞాపకార్థం మున్సిపల్ కార్మికులకు టిఫిన్ బాక్సులు అందజేత   •   CAA అమలు వేగవంతం— చొరబాటుదారులు సామాన్లు సర్దుకోవాల్సిందే! మోదీ హెచ్చరిక   •  

ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలి

12-01-2026 05:43 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం తో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ప్రజావాణి కార్యక్రమంలో 22 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.