12-01-2026 05:41:22 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): ఇన్స్ పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ (ఐ.ఎస్.ఆర్.డి)స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లింగంపల్లి గ్రామంలో నివసిస్తున్న ప్రజల జీవన స్థితిగతులను సమగ్రంగా అర్థం చేసుకునే ఉద్దేశంతో ఆర్థిక, సామాజిక మరియు ఆరోగ్య సర్వే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సర్వే ద్వారా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ప్రభుత్వ, వివిధ సంక్షేమ సంస్థల పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అలాగే ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడేలా అవసరమైన కార్యక్రమాలు రూపొందించడానికి ఈ సర్వే ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా నిలుస్తూ, గ్రామ సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పలు అభివృద్ధి చర్యలు చేపట్టనున్నారు. అనంతరం సర్వే పోస్టర్ లను ఉప సర్పంచ్ ఎడ్ల గంగారం గ్రామ ప్రజలు యువత ఆవిష్కరించారు.
కార్యక్రమ వివరాలు:
కార్యక్రమం పేరు: లింగంపల్లి గ్రామ ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సర్వే
ప్రారంభ తేదీ: 12 జనవరి 2026
ముగింపు తేదీ: 19 ఫిబ్రవరి 2026
ప్రదేశం: లింగంపల్లి గ్రామం
గ్రామ ప్రజలందరూ ఈ సర్వేకు సహకరించి, అవసరమైన సమాచారం అందించి, తమ అభివృద్ధికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.