06-05-2025 12:00:00 AM
ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్ మే 5 (విజయక్రాంతి): ప్రతి సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల రోజును నిర్వహించడం జరుగుతుందని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఫిర్యాదుదారులు సమస్యలను జిల్లా ఎస్పీకి వివరించారు, వెంటనే జిల్లా ఎస్పీ సంబంధిత పోలీ సు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలను జారీ చేశారు.
ప్రజా సమస్యలను త్వరితగతి న పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను సత్వరమే పరి ష్కరించినప్పుడే పోలీసుల పట్ల ఉన్న గౌర వం పతక స్థాయికి చేరుకుంటుందని, ప్రజలలో పోలీసులపై నమ్మకం, కీర్తి ప్రతిష్టలు పెంపొందించబడతాయని తెలిపారు. సుదూర ప్రాంతాల ఫిర్యాదుదారులు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకోలేని వారు మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో ద్వారా 8712659599 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.