06-05-2025 12:00:00 AM
సీపీఐ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి, వర్గసభ్యుడు ఈటీ నరసింహ
ముషీరాబాద్, మే 5 (విజయక్రాం తి): ఆర్థిక నష్టాలను, విద్యుత్ చార్జీల భారాన్ని బూచిగా చూపుతూ హైదరాబాద్ మెట్రో రైల్ చార్జీలు పెంచొద్దని సిపిఐ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి, వర్గసభ్యులు ఈటీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు.
హైదరాబాద్‌లో మెట్రోపై రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణికులు ఆధారపడుతున్నారని, అసాధారణ ఛార్జీల పెంపు ప్రజా రవాణా వినియోగదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలపై మోయలేని భా రం పడుతుందని అయన తెలిపారు.
చెన్ను మెట్రో ఛార్జీని చివరిగా ఫిబ్రవరి 22, 2021న సవరించారని, అప్పు డు ఎక్కువ మంది ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకునేలా ప్రో త్సహించడానికి గరిష్ట ఛార్జీని రూ.70 నుండి రూ.50కి తగ్గించారని, దీంతో అక్యూపెన్సీ పెరిగి చెన్ను మెట్రోకు నష్టాలు కూడా తగ్గాయని గుర్తు చేశారు.
మెట్రో రైల్ ఛార్జీల పెంపు అనివార్యమని భావిస్తే ప్రయాణికులపై భా రం పడకుండా ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ ఇతర ఆదా య మార్గాలను అన్వేషించుకోవాలని కోరారు. మెట్రో చార్జీలు పెంచితే సహించేదిలేదని, పెద్దఎత్తున ఉద్యమిస్తామని నరసింహ హెచ్చరించారు.