calender_icon.png 27 October, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాకుర్ పల్లి తండాలో పంపుసెట్టు ప్రారంభం

27-10-2025 06:22:30 PM

ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): మండలంలోని బాకుర్పల్లి తండాకు కేంద్ర నిధులతో బోర్ పంపు సెట్టును బీజేపీ నాయకులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తండాలో తాగునీటి సమస్యను గ్రామస్థులు తమ దృష్టికి తేవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయినా గోపి, కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షడు రామచంద్రా రెడ్డి దృష్టికి తీసుకువచ్చామన్నారు. దీంతో వారు కేంద్ర హోం శాఖ సహాయమాత్యుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్కు తెలుపగా వారు వెంటనే స్పందించి బాకుర్పల్లి తండాకు పంపుసెట్టును మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు అజ్మీర రమేష్, బూత్ అధ్యక్షుడు అజ్మీర గణేష్, నాయకులు మురళి, తిరుపతి, రాజునాయక్ సంతోష్, గౌరవ తండ నాయక్ అజ్మీర చంద్రు నాయక్, కారోబార్, రమావత్ జగన్ నాయక్, గ్రామ కార్యదర్శి, భరత్ తదితరులు పాల్గొన్నారు.