calender_icon.png 1 July, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయపాలన పాటించాలి

01-07-2025 02:00:40 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం అసిఫాబాద్,జూన్ 30(విజయ క్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది విధులలో సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం తో కలిసి ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వైద్య సేవల కొరకు వచ్చే ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.

ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను హౌసింగ్ పి. డి. వేణుగోపాల్ తో కలిసి పరిశీలించారు. నమూనా ఇందిరమ్మ ఇంటిని త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు చూపించి ఇదే నమూనాలో ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా అవగాహన కల్పించాలని, మండలానికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా ప్రారంభించేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందిస్తుందని, త్వరగా గ్రౌండింగ్  చేపట్టాలని తెలిపారు. 

మండల కేంద్రంలోని రెబ్బెన ఆగ్రో సీడ్స్ ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసి స్టాకు రిజిస్టర్ లను పరిశీలించారు. రైతులకు సాగుకు సరిపడా యూరియా నిల్వలను సీజన్ ను బట్టి అందుబాటులో ఉంచాలని, కొనుగోలు చేసి న రైతులకు రసీదులు జారీ చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని, అధిక ధరలకు విక్రయించినట్లయితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించి వంటశాలను పరిశీలిం చి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, ఆహారం తయారు చేసే సమయం లో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని తెలి పారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలను త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలని తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విధులలో సమయపాలన పాటించాలని తెలిపారు. 

విద్యార్థులతో మాట్లాడుతూ వారికి అందుతున్న సౌకర్యాలు, విద్యాబోధన అం శాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సూర్యప్రకాష్, మండల వ్యవసాయ శాఖ అధికారి, ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.