calender_icon.png 1 July, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి రాజాసింగ్ రాజీనామా లేఖ

01-07-2025 01:59:45 AM

  1. ఎన్నికల నియమావళి పాటించకుండా పార్టీపైనే దుష్ర్పచారం
  2. బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి రాణి రుద్రమ

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే అనేకమార్లు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని, చాలా సార్లు హద్దుమీరారని బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి రాణి రుద్ర మ తెలిపారు. ఎన్నికల నియమావళి పాటించకుండా పార్టీపైనే దుష్ర్పచారం చేశారంటూ రాజాసింగ్ తీరును ఎండగట్టారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడారు.

రాజాసింగ్ రాష్ర్ట పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడానికి బీజేపి రాష్ర్ట కార్యాలయానికి వచ్చారని... నామినేషన్ పత్రాన్ని కేంద్ర మంత్రి, సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరం ద్లాజే నుంచి తీసుకున్నారన్నారు. అయితే పార్టీ నియమావళి ప్రకారం, నామినేషన్ ఫారం చెల్లుబాటయ్యేందుకు పది మంది జాతీయ కౌన్సిల్ సభ్యుల సంతకాలు తప్పనిసరన్నారు.

ఈ విషయా న్ని రాజాసింగ్‌కు రిటర్నింగ్ అధికారులే చెప్పారని.. అయితే సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉల్టా పార్టీనే బద్నాం చేశారని ఆరోపించారు. రాష్ర్ట అధ్యక్షులు కిషన్ రెడ్డికి రాజాసింగ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారని... ఆ రాజీనామా పత్రాన్ని ఢిల్లీకి పంపిస్తామన్నారు. 

నియమావళి ప్రకారమే: పాయల్ శంకర్

బీజేపీ రాష్ర్ట అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పార్టీ నియమావళికి అనుగుణంగానే జరుగుతోందని బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ స్పష్టం చేశారు. రాష్ర్ట అధ్యక్ష ఎన్నికలో మిగతా వారికి నామినేషన్ అవకాశం ఇవ్వలేదని కొన్ని వర్గాలు, మీడియాలో వచ్చిన వార్తలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, పార్టీకి చెందిన అర్హులైైన ఏ నాయకుడైనా.. నామినేషన్ వేసేందు కు వస్తే కేంద్ర పరిశీలకులుగా వచ్చిన వారు తగిన అవకాశాన్ని కల్పించారని తెలిపారు.

బీజేపీ కోట్లాదిమంది కార్యకర్తలున్న ఏకైక పార్టీ అని.. అందుకే రాష్ర్ట అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ అనేది నియమావళి ప్రకారమే జరుగుతోందన్నారు. నియమావళి ప్రకారం పది మంది సభ్యుల ప్రతిపాదనతో నామినేషన్ వేసిన పత్రమే ఆమోదయోగ్యమన్నారు. ఈ నియమాన్ని పక్కాగా పాటిస్తూ రాష్ర్ట అధ్యక్ష ఎన్నిక జరుగుతోందని వెల్లడించారు.