01-07-2025 02:02:25 AM
సిర్పూర్ (యు), జూన్ 30 (విజయక్రాం తి): క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడం జరుగుతుందని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మ న్ కుడ్మెత విశ్వనాథ్ అన్నారు.టెన్నిస్ క్రికెట్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులను సాలువాతో ఘనంగా సన్మానించారు.
జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ మండలాల నుండి 14 మంది రాష్ట్రస్థాయిలో పాల్గొనగా నలుగురు అంతర్జాతీయ స్థాయికి ఎంపికవ్వడం గర్భంగా ఉందని తెలిపారు. ఎంపికైన ప్రకాష్ ,తుకారాం ,వినాయక్, శేఖర్ లు వచ్చేనెల జరగనున్న పోటీలలో పాల్గొనడం జరుగుతుందని టెన్నిస్ అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, తదితరులు పాల్గొన్నారు.