28 April, 2026 | 2:04 AM

పంజాబ్‌ను ఆపతరమా?

28-04-2026 12:29 AM

రాజస్థాన్ రాయల్స్‌కు సవాల్

ముల్లాన్‌పూర్, ఏప్రిల్ 27 : ఐపీఎల్ 19వ సీజన్ లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ మరో విజయంపై కన్నేసింది. ముల్లాన్ పూర్ వేదికగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తలపడబోతోంది. అసలు పంజాబ్ కింగ్స్ జోరు మామూలుగా లేదు. మొదట బ్యాటింగ్ అయినా, ఛేజింగ్ అయినా ఆ జట్టు జోరుకు అడ్డే లేకుండా పోయింది.

గత మ్యాచ్ లో 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని అలవోకగా ఛేదిం చి చరిత్ర సృష్టించింది. పంజాబ్ బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌తో చెలరేగిపోతున్నారు. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ , అందరి కంటే ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతున్నాడు. అటు కెప్టెన్ గానూ అదరగొడుతూ, ఇటు బ్యాటర్ గానూ చెలరేగిపోతూ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూ డా లేని జట్టు పంజాబ్ కింగ్స్ మాత్రమే. ఆ డిన 7 మ్యాచ్‌లలో 6 విజయాలు, ఒకటి వర్షంతో రద్దయిన కారణంగా మొత్తం 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

పంజాబ్ కింగ్స్ బౌలింగ్ మెరుగుపడాల్సి ఉంది. విజయ్ కుమార్ వైశాఖ్ , చాహల్ నిలకడగా రాణిస్తుండగా.. మిగిలిన బౌలర్లు బార్ట్ లెట్, అర్షదీప్ సింగ్, మార్కో జెన్సన్ వికెట్లు తీస్తున్నా పరుగులు కట్టడి చేయలేకపోతున్నారు. వీరు కూడా గాడిన పడితే ఇక పంజాబ్ జైత్రయాత్రను అడ్డుకోవడం కష్ట మే. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌కు గత మ్యాచ్ లో షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 225 పరుగుల భారీస్కోరు చేసి నా కాపాడుకోలేకపోయింది. బ్యాటింగ్ ప రంగా అదరగొడుతున్నా బౌలింగ్ మాత్రం ఆ జట్టుకు సమస్యగా మారింది. నిలకడలేమితో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు సతమత మవుతున్నారు. బ్యాటింగ్‌లో మాత్రం రాయ ల్స్‌కు తిరుగులేదు.

వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్ లో ఉండగా.. జైస్వాల్ కూడా రాణిస్తున్నాడు. జురెల్, ఫెరీరా, హెట్ మెయి ర్ , జడేజా వంటి వారితో బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం ఇప్పటి వరకూ చెప్పుకోదగిన ఇ న్నింగ్స్ ఆడలేదు. అటు బౌలింగ్‌లో ఆర్చర్, బర్గర్ తో పాటు తుషార్ దేశ్ పాండే పేస్ విభాగంలో కీలకంగా ఉన్నారు. స్పిన్నర్లుగా జడేజా, రవి బిష్ణోయ్ పర్వాలేదనిపిస్తున్నా పరుగులు కట్టడి చేయడంలో ఇబ్బందిపడుతున్నారు.

దీంతో బౌలింగ్ బలహీనతలను అధిగమిస్తే తప్ప బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్‌ను ఓడించడం కష్టమే.  గత రికార్డులను చూస్తే రాజస్థాన్ రాయల్స్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 30 మ్యాచ్ లలో తలపడితే రాజస్థాన్ 17 సార్లు, పంజా బ్ 13 సార్లు గెలిచాయి. ముల్లాన్ పూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా. దీని ప్రకారం ఛేజింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు.

తుది జట్లు అంచనా

పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రి యాన్ష్ ఆర్య, మిఛెల్ ఓవెన్, శ్రేయాస్ అ య్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, స్టోయినిస్, మార్కో జెన్సన్, బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్షదీప్, చాహల్

రాజస్థాన్ రాయల్స్ : జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, రవి బిష్ణో య్, బ్రిజేష్ శర్మ, బర్గర్, తుషార్ దేశ్‌పాండే