11-11-2025 04:46:01 PM
సిపిఐ(ఎం)ఎంమండల కార్యదర్శి గుండగాని మధుసూదన్
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్థానిక ప్రజా సంఘాల భవనంలో కామ్రేడ్ బాణాల రాజన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా సిపియం మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ మాట్లాడుతూ, మరిపెడ మండలంలో ఎడ్జెర్ల, వీరారం, ఎల్లంపేట, చిల్లంచర్ల, రాంపురం, గిరిపురం, తాళ్ల ఊకల్, గుండె పూడి, అనేక తండాలలో, ఆ ఆల్రెడీ వరి కోతలు మొదలయ్యాయి, అయినా కూడా మండలంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో గాని ఐకేపీ కేంద్రాలు ఇంకా మొదలు పెట్టలేదు, కాబట్టి అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి, మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏపీఎం, కలెక్టర్ సహకారంతో, వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పొదుపు సంఘాల వివోలా సహకారంతో, మండలంలో అన్ని గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలనూ ఈ సంవత్సరం పున ప్రారంభించాలని, ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు బాణాల రాజన్న, ఐద్వా మండల ప్రధాన కార్యదర్శి దొంతు మమత, కొండ ఉప్పలయ్య, జిన్నా లచ్చన్న, బోడపట్ల రాజశేఖర్, కందాల రమేష్, దంత సోమన్న, బాణాల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.