18 April, 2026 | 12:11 AM

తొర్రూర్ మున్సిపాలిటీకి కొత్త ల్యాడర్ కొనుగోలు

17-05-2025 12:47 AM

మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్‌తొర్రూరు, మే 16: తొర్రూర్ మున్సిపాలిటీకి కొ త్త ల్యాడర్ కొనుగోలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కొత్తగా కొనుగోలు చేసి తెచ్చిన లాడర్ పనితీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ మెయిన్ రోడ్డులో ఉన్న ఐమాక్స్ లైట్లను రిపేర్ చేయించడానికి 2 లక్షల 20వేల రూపాయలతో కొత్తగా ల్యాడ ర్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీని వల్ల ఐమాక్స్ లైట్లకు ఎలక్ట్రీషియన్స్ చే నిత్యం పర్యవేక్షణ చేయించి వెలగని ఐమాక్స్ లైట్ల స్థానంలో నూతన ఐమాక్స్ లైట్లను పెట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ రంజిత్, మేనేజర్ కట్టాస్వామి, ఎలక్ట్రీషియన్స్, తదితరులు పాల్గొన్నారు.