17-05-2025 12:48:18 AM
నీటిపారుదల శాఖ మంత్రి తో చర్చించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి, మే 16 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు రూ. 258 కోట్లతో నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బాన్సువాడ నియోజకవర్గం లోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో చర్చించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పురోగతి గురించి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి రాహుల్ బొజ్జా , సహాయ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ , కామారెడ్డి జిల్లా ఇరిగేషన్ CE శ్రీనివాస్ కామారెడ్డి జిల్లాబాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల పరిధిలో నూతనంగా రూ. 258 కోట్లతో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత లోపం లేకుండా చూడాలని సూచించారు. రిజర్వాయర్ పనులపై కాంట్రాక్టర్, అధికారులు ప్రతి మంగళవారము సమావేశము ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.అలాగే జాకోర, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని నాణ్యత లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు.