22 April, 2026 | 3:11 AM

రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు

22-04-2026 01:01 AM

ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కోనరావుపేట ఏప్రిల్ 21 (విజయ క్రాంతి):కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో మంగళవారం వరి ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొంటూ, గ్రేడ్-ఏ వరి ధాన్యానికి రూ.2389 మద్దతు ధర చెల్లిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి నాయకత్వంలో రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మెరుగైన విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు.అదేవిధంగా రు ణమాఫీ అమలు చేసి రైతులకు ఊరటనిచ్చామని, సన్న వడ్లు పండించే రైతులకు రూ. 500 బోనస్ అందిస్తున్నామని వెల్లడించా రు.

పంటలు ఎండిపోకుండా ఉండేందుకు ఎల్లంపల్లి నీటిని మూడు విడతల్లో విడుదల చేసినట్లు తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే జిల్లా కేంద్ర గోదాములను వినియోగిస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం కోనరావుపేటలో జరిగిన ఎల్లమ్మ సిద్దోగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రైతులు పంట మార్పిడి విధానా న్ని అనుసరించాలని, వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీను గుర్తుచేస్తూ, ఆయిల్ ఫామ్ సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఆయిల్ ఫామ్ సాగుతో కోతుల బెడద, అకాల వర్షాలు, వడగళ్ల సమస్యలు తక్కువగా ఉంటాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలని సూచించారు.