27 May, 2026 | 2:03 AM

మజా మజాగా.. తాటి ముంజలు

27-05-2026 12:22 AM
  1. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల నుండి ఏజెన్సీ కి తరలించి అమ్మకాలు..
  2. డజన్ మంజులకు రూ.100..
  3. కొనుగోలుకు పోటీ పడుతున్న వినియోగదారులు..

ఉట్నూర్, మే 5 ( విజయ క్రాంతి ): మండు వేసవిలో చల్లదనానికి దొరికే వాటి లో ముఖ్యమైనవి తాటి ముంజలు.. ముంజ లు చూడడానికి జెల్లిలా.. పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తా టి ముంజలు శరీరానికి కలిగించే చలువ కారణంగా వీటిని ఐస్ యాపిల్ అని కూడా అం టారు. తాటి ముంజలు ఎండాకాలం ప్రా రంభం కాగానే మార్కెట్లో దర్శనమిస్తా యి. శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి..

నీటి శాతం అధికం

 తాటి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉంటుందంటారు. ముంజల్లో తక్కువ మొ త్తంలో  క్యాలరీలు ఎక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుందని, ముంజలు నీటి శాతం అధికంగా ఉంటుందని, వీటిని తింటే  దాహం సమస్య తీరుతుందని వైద్యు లు అంటున్నారు. తాటి ముంజలతో శరీరానికి కావలసిన ఏ, బీ సీ విటమిన్లు, ఐరన్ జింక్, ఫాస్పర స్, పొటాషియం వంటివి పు ష్కలంగా ఉంటాయని వైద్యులు అంటున్నా రు. పార్టీ ముంజలలో నీరు యొక్క ఉండడంతోశరీర బరువు తగ్గించడంలో ఎంతో గా ను తోడ్పడుతాయని వైద్యులు చెబుతున్నారు.

గిరాకీ ఎక్కువ..

మంచిర్యాల, నిర్మల్ జిల్లా లో విరివిగా దొరికే తాటి ముంజలను అక్కడి నుండి చిరు వ్యాపారులు తీసుకువచ్చి రోడ్డుపక్కలన చెట్ల నీడలో ఉండి విక్రయిస్తున్నారు. రహదారులపై వేసవి ఎండల్లో ప్రయాణించే ప్రయా ణికులు తాటి ముంజలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళ్లడంతో పాటు తాగునీటి నుండి ఉపశమనం పొందేందుకు తాటి ముంజలను సైతం అక్కడే తింటున్నారు. డ జరుకు వంద రూపాయలు చెల్లించి వినియోగదారులు తాటి ముంజలను కొనుగో లు చేస్తున్నారు. తాటి ముంజలతో చిరు వ్యాపారులకు వేసవిలో ఉపాధి కలగడంతో పాటు ప్రజలు తాటి ముంజలు తింటూ ఎండల నుండి ఉపశమనం పొందుతున్నారు.