1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
- 40 లక్షల టన్నుల బొగ్గు ద్వారా ఆదాయం వచ్చిందన్నరు
- ఆదాయంపై ఇన్‌కంట్యాక్స్ కూడా కట్టినమన్నరు
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసురుతున్నా
- అంతమొత్తంలో బొగ్గు ఎక్కడుందో చూపించాలి
- మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- టీబీజీకేఎస్ నేతలు బొగ్గు నిల్వలపై నిలదీయాలని పిలుపు
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): ‘సింగరేణి పరిధిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని సంస్థ అధికారిక వెబ్‌సైట్ వెల్లడిస్తున్నది. బొగ్గు ద్వారా రూ.1600 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆ ఆదాయంపై ఇన్‌కం టాక్స్ కూడా కట్టామని యాజమాన్యం చెబుతున్నది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నా. తెలంగాణలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎక్కడుందో ఆధారాలు చూపించాలి.
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకపోతే ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిందే’నని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 40 లక్షల బొగ్గు నిల్వలపై టీబీజీకేఎస్ నేతలు నిలదీయాలని సూచించారు. కాంగ్రెస్ హయంలో సింగరేణి కుంభకోణాల గనిలా మారిందని, నైనీ బ్లాక్ బొగ్గు గనుల టెండర్ అంశం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బయట పెట్టామని గుర్తుచేశారు.
బొగ్గు గనుల్లో భారీ అవినీతి జరుగుతోందని బీఆర్‌ఎస్ మొండిపడితే, కేంద్రం దిగివచ్చి ఒక కమిటీ వేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు. కమిటీ ఏం తేల్చిందనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. సంస్థ పరిధిలో త్వరలో మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. రాజస్థాన్‌తో కలిసి పాకిస్థాన్ సరిహద్దులోని జైషల్మీర్‌లో సింగరేణితో సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పే దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తున్నదే గానీ, ఎన్టీపీసీ అత్యంత చౌకగా విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పీపీఏ, డీపీఆర్‌కు ఆమోదం లేకుం డానే థర్మల్ పవర్ ప్లాంట్లు సివిల్ పనులు చేపడుతున్నారని, ప్లాంట్ పనులు ఆలస్యమ య్యే కొద్దీ కోట్లలో నష్టం వస్తుందని దుయ్యబట్టారు. కమీషన్ల కోసమే ప్రభుత్వ పెద్దలు ఆర్డర్లు ఇచ్చి పేమెంట్లు తీసుకోవడం, సోలార్ పవర్ ప్లాంట్ టెండర్‌లో మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఫుట్‌బాల్ ఆట పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి సింగరేణి సొమ్ము వాడుకున్నారని దుయ్యబట్టారు.
బంగారు బాతులాంటి సింగరేణిని అప్పుల కుప్పగా చేశారని అభిప్రాయపడ్డారు. ‘కాంగ్రెస్ హటావో.. -సింగరేణి బచావో’ అనేది బొగ్గు గని కార్మికుల నినాదం కావాలని పిలుపునిచ్చారు. సంస్థ పరిస్థితి ఇలాగే ఉంటే, యాజమాన్యం భవిష్యత్‌లో కార్మికులకు జీతా లు ఇవ్వలేని స్థితికి వస్తుందని జోస్యం చెప్పా రు.
ఉమ్మడి పాలనలో చంద్రబాబు సింగరేణీయుల ఉద్యోగాలు తీసేస్తే, స్వరాష్ట్రంలో బీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్ 19 వేల మందికి ఉద్యోగాలిచ్చి జీవం పోశారని కొనియాడారు. ఉద్యోగాలిచ్చుడు బీఆర్‌ఎస్ పనైతే, ఉన్న ఉద్యోగాలను తొలగించడం కాంగ్రెస్ పని అంటూ ఎద్దేవా చేశారు. సంస్థను దోచుకొనుడు కాంగ్రెస్ ప్రభుత్వనైజంగా మారిందని ఆరోపించారు.
నైని బ్లాక్ విషయంలో కొందరు జర్నలిస్లులు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చిందని వాపో యారు. సింగరేణికి కేటాయించాల్సిన బకాయిలు అడ్డగోలుగా పెరుగుతున్నాయని దుయ్యబట్టారు. 2014లో సింగరేణికి ప్రభు త్వం ఇవ్వాల్సిన బకాయిలు కేవలం 2 వేల కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. కానీ, కాం గ్రెస్ పాలనలో బకాయిలు ఎన్నో రెట్లు పెరిగాయని వెల్లడించారు.






