6 April, 2026 | 7:05 PM

కిమ్‌కు పుతిన్ గుర్రాలు

02-09-2024 12:24 AM

24 జాతి గుర్రాలు బహుమతి

ప్యాంగ్యాంగ్, సెప్టెంబర్ 1: ఉక్రెయిన్‌తో యుద్ధంలో వాడేందుకు చిన్నపాటి ఆయుధాలు సరఫరా చేసినందుకు ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అపురూపమైన బహుమతి ఇచ్చారు. అత్యంత నాణ్యమైన 24 గుర్రాలను కిమ్‌కు ఆదివారం బహూకరించారు. ఇందులో 19 మగవి, 5 ఆడ గుర్రాలున్నాయి. ఇవి ఓర్లోవ్ ట్రాటర్ బ్రీడ్ గుర్రాలని టైమ్స్ మీడియా సంస్థ తెలిపింది. రెండేండ్ల క్రితం కూడా ఈ జాతికి చెందిన 30 గుర్రాలను కిమ్‌కు రష్యా అందజేసింది. అందులోని ఓ తెల్లగుర్రంపై స్వారీ చేస్తూ కిమ్ ఓ వీడియోను కూడా తీసి ప్రపంచానికి వదిలారు.