దలైలామాకు పీవీ స్మారక అవార్డు
09-05-2024 01:38 AM
హైదరాబాద్,మే 8 (విజయక్రాంతి): భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక పీపీ నరసింహారావు మెమోరియల్ అవార్డును ప్రపంచ శాంతిదూత దలైలామాకు ప్రకటించారు. ధర్మశాలలోని ఆయన నివాసంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. పీవీ మనవడు పీవీఆర్ కశ్యప్, పీవీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత పీవీ స్మారక అవార్డును అందుకుంటున్నందుకు దలైలామా హర్షం వ్యక్తం చేశారు. భారతరత్న పీవీ నరసింహరావు ప్రపంచశాంతి కోసం చేసిన సేవలను ఆయన కొనియాడారు. పీవీ మెమోరియల్ అవార్డును గతంలో సబర్మతి ఆశ్రమానికి, రతన్ టాటాకు ఇచ్చారు.




