13 April, 2026 | 6:09 PM

దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు

09-05-2024 01:41 AM

ఆలయాల్లో భక్తులకు మౌలిక సదుపాయాలు 

భక్తుల సౌకర్యార్థం వేసవిలో ప్రత్యేక ఏర్పాట్లు 

రాష్ట్ర ఎండోమెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఎండోమెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఆదేశించారు. బుధవారం ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్‌లో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాదాయ భూముల వివరాల ను సేకరించాలన్నారు. అవి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గతం లో ఆక్రమణలకు గురైన దేవాదాయ భూములను గుర్తించి, తిరిగి స్వాధీనం చేసుకునేం దుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలన్నారు. వేసవి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. త్రాగునీరు, గ్రీన్ మ్యాట్స్, కార్పెట్స్‌తో పాటు భక్తులకు ఎండ తాకిడి లేకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ భూములు దుర్వినియో గం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఎండోమెంట్ కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక అధికారి హనుమంతరావుతో పాటు అడిషనల్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఇతర దేవాదాయ అధికారులు పాల్గొన్నారు.