14 August, 2026 | 2:58 AM

సీరియస్ సబ్జెక్టును కామెడీ కోణంలో చెప్తే ప్యార్ ప్రేమ కళ్యాణం

14-08-2026 12:23 AM

ఎలన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. ఎ రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎలన్ దర్శకత్వంలో శ్రీనిధి సాగర్ నిర్మించిన ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్ ముఖ్యపాత్రను పోషించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, డైరెక్టర్ ఎలన్ మాట్లాడుతూ.. “నేను ఎప్పటి నుంచో తెలుగు సినిమా చేయాలని ఎదురుచూస్తున్నా.

‘ప్యార్ ప్రేమ కళ్యాణం’తో అది నిజమవుతోంది. తెలుగు వాళ్లు మా సినిమా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు” అన్నారు. ‘ఒక అబ్బాయి పెళ్లి తర్వాత అమ్మాయి వాళ్ల ఇంటికి వచ్చెస్తే ఎలాంటి బాధలు పడతాడనేది సినిమాలో చాలా వినోదాత్మకంగా చూపించాం’ అని హీరోయిన్ శాన్వీ మేఘన చెప్పింది. ‘ఓ సీరియస్ సబ్జెక్టును కామెడీ కోణంలో చెప్పే ప్రయత్నమే ఈ సినిమా’ అని నిర్మాత శ్రీనిధి సాగర్ తెలిపారు.