ఐ యామ్ గేమ్ రెండు వారాలు వెనక్కి
దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు. తొలుత ఆగస్టు 20న ఓనం కానుకగా విడుదల చేయాలని ప్రకటించిన ఈ చిత్రం.. ఇప్పుడు రెండు వారాలు వాయిదా పడి సెప్టెంబర్ 3న మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చినట్లు మేకర్స్ తెలిపారు.
దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిలమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్‌కు నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, తమిళ -దర్శక నటుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జిమ్షీ ఖలీద్; సంగీతం: జేక్స్ బిజోయ్; ఎడిటింగ్: చమన్ చాకో; ప్రొడక్షన్ డిజైనర్: అజయన్ చలిసేరి.






