11 August, 2026 | 2:02 AM

కోయగూడెంలో కొండచిలువ పట్టివేత

11-08-2026 12:00 AM

బూర్గంపాడు, ఆగస్టు 10 (విజయక్రాంతి): మండలంలోని సారపాక, కోయగూడెం,తాళ్లగొమ్మూరు గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న కొండచిలువను అవధానుల శ్రీనివాస శాస్త్రి సోమవారం పట్టుకున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో గ్రామాల పరిసరాల్లో విషసర్పాలు, ఇతర పాముల సంచారం పెరిగిందని శ్రీనివాస శాస్త్రి తెలిపారు. కోయగూడెం పంచాయతీ పరిధిలోని మసీదు మైదానంలో సెలవు రోజుల్లో పిల్లలు క్రికెట్ ఆడేందుకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాములు సంచరించే ప్రాంతాలకు చిన్నారులను పంపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పాములు కనిపించినప్పుడు వాటిని పట్టుకునేందుకు స్వయంగా ప్రయత్నించకుండా నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు.