25-05-2025 12:24:17 AM
కొవిడ్, డెంగీ పేరిట దోచుకుంటే కఠినచర్యలు
మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): కొన్ని దేశా ల్లో కోవిడ్ కేసులు స్పల్పంగా పెరిగినప్పటికీ, హాస్పిటలైజేషన్ చాలా తక్కువగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మన దేశంలో పరిస్థితి సాధారణంగా ఉందని తెలిపారు.
కరోనా వైర స్ వ్యాప్తి, సీజనల్ డిసీజ్‌ల నియంత్రణపై సమీక్ష చేశా రు. శనివారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇండియా, ఇతర దేశాల్లో ఉన్న కోవిడ్ పరిస్థితులను అధికారులు, ఎపిడమాలజిస్టులు మంత్రికి వివరించారు.
జేఎన్.1 వేరియంట్ కేసులు కొన్ని నమోదయ్యాయని..ఈ వేరియంట్ 2023నుంచే ఇండియాలో వ్యాప్తిలో ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులేమీ లేవన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి రాష్ట్రాలకు ఇప్పటివరకూ అడ్వుజరీలు, గైడ్‌లైన్స్ ఏమీ రాలేదు అని అధికారులు తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉండడం, ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడమే ఇందుకు కారణమై ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు.
రాష్ర్టంలో అక్కడక్కడ నమోద య్యే కోవిడ్ కేసులను మేనేజ్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని అధికారులు మంత్రికి తెలిపారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు.
అలాగే వర్షాకాలంలో సీజనల్ డిసీజ్‌ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్, డెంగీ పేరిట ప్రజలను ఆందోళనకు గురిచేసి, దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, డీఎంఈ నరేంద్రకుమార్, డీహెచ్ రవిందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు, ఎపిడమాలజిస్టులు ఉన్నారు.