నాణ్యతకు తిలోదకాలు...
- క్రిస్టియన్ మైనారిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణంలో నాణ్యత డొల్ల
- నాసీరకంగా సాగుతున్న పనులు
- గుత్తేదారు ఇష్టారాజ్యం
- మామూలుగా తీసుకుంటున్న అధికారులు
- వివరాలడిగితే విసుక్కుంటున్న డీఈ
లక్షేట్టిపేట, ఆగష్టు 1౨ : మంచిర్యాల జిల్లా పట్టణంలోని కస్తూరిభా పాఠశాల సమీపంలో నిర్మిస్తున్న క్రిస్టియన్ మైనారిటీ ఫంక్ష న్ హాల్ నిర్మాణంలో నాణ్యత జాడ బొత్తిగా కనిపించడం లేదు. ప్రభుత్వం రూ. 50 లక్షల నిధులు వెచ్చించి, ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని తలపెట్టినప్పటికీ గుత్తేదారు, సంబంధిత అధికారులు ’మాములుగా’ తీసుకోవడంతో నాణ్యత నీ జాడేది..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాసిరకం సిమెంట్, ఇతర సా మాగ్రి వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పిల్లర్ల దశలోనే సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
పిల్లర్స్ ను సరిగ్గా నిర్మించక పోవడంతో ఎక్కడిక్కడ రంధ్రాలు పడి ఐరన్ రాడ్స్ బయటకు కనిపిస్తున్నాయి. చాలా వరకు సిమెంట్ ను పైపైన ఆ రంధ్రాలలో నింపినప్పటికీ సరైన ముందు జాగ్రత్తలు తీసుకొని పనులు చేయడం లేదని స్పష్టమవుతుంది. పిల్లర్స్, పునాది (పుట్టింగ్) దశలో నే నిర్లక్ష్యం వహిస్తే ఇంకా పూర్తి స్థాయి నిర్మా ణం ఎలా ఉంటుందోనని అనుమానాలు కలుగుతున్నాయి.
పట్టించుకోని అధికారులు...
ప్రభుత్వం సమాజంలోని పేద, మధ్య తరగతి ప్రజల ఫంక్షన్స్ సౌకర్యార్థం హాల్స్ ను నిర్మిస్తున్నప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాగా, క్రిస్టియన్ మైనారిటీ ఫంక్షన్ హల్ పనులను రహదారులు, భవనాల శాఖ ఏఈ సునీల్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. నాసిరకం పనులు జరుగుతున్నప్పటికీ అధికారులు, గుత్తేదారులకు సూచనలు చేయడం లేదని తెలుస్తోంది.
నాసిరకం పనుల విషయంలో ప్రభుత్వ ధనాన్ని సంబంధిత ఉద్యోగి నిర్ల క్ష్యం కారణంగా వృధా చేయడమేనని ప్రజ లు అభిప్రాయపడుతున్నారు. నాసిరకంగా నిర్మిస్తున్న ఫంక్షన్‌హల్ గురించి ఏఈ సు నీల్‌ను ఫోన్‌లో సంప్రదించగా, తాను హా స్పిటల్‌లో ఉన్నానని చెప్పి తర్వాత స్పందించడం మానేశారు.
వివరాలడిగితే విసుక్కుంటున్న డీఈ
ఏఈ సునీల్ స్పందించకపోవడంతో సం బంధిత శాఖ డీఈ జగదీశ్ ను ఫంక్షన్ హల్ నిర్మాణం నిర్లక్ష్యంపై వివరాలడిగితే బ్లాక్మెయిల్ చేస్తున్నారా..? ఎవరికైన చెప్పుకోండి. నన్ను ఏం చేయలేరని దురుసుగా సమాధానమిచ్చారు. అంతే కాకుండా విలేకరుల గు రించి నాకు బాగా తెలుసు బ్లాక్మెయిల్ చేస్తారని అసంబద్ధ మాటలు మాట్లాడారు. దీనిపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు సంబంధిత నిర్మాణం గురించి వీడియోలు, ఫోటోలు పంపించగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






