calender_icon.png 28 October, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి

28-10-2025 12:00:00 AM

  1. ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్

తంగళ్లపల్లి కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 27 (విజయక్రాంతి): జిల్లాలోతంగళ్లపల్లి మండలం విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీ ను ఇంచార్జి కలెక్టర్ సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు పరిశీలించారు. కోడి గుడ్లపై స్టాంప్ ఉండేలా చూసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు కింద కూర్చుని మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని వివరించారు. పర్యావరణ, భవిష్యత్ ప్రణాళికలు, అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణలో 9 వ తరగతి విద్యార్థులకు బయో సైన్సులోని ఫోటో సింథసిస్*పై వివరించారు. విద్యార్థులందరూ చదువు పై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపు ఇచ్చారు. ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు.

విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యాలయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని డీఈవోను ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు.సందర్శనలో కేజీబీవీ ఎస్‌ఓ శ్యామల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.