calender_icon.png 17 January, 2026 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాఘ అమావాస్య, మహా శివరాత్రి ఏర్పాట్లపై ఈఓ సమీక్ష

17-01-2026 09:01:15 PM

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు దత్తత దేవాలయమైన శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థానంలో నేడు ఆదివారం  జరగనున్న మాఘ అమావాస్య జాతర, రాబోయే మహా శివరాత్రిని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ ఎల్. రమాదేవి ఏర్పాట్లపై శనివారం సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు, క్యూలైన్లు, పార్కింగ్, విద్యుత్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు.