నాణ్యమైన యూనిఫాంలను నిర్ణీత గడువులోగా అందించాలి
28-08-2026 01:13 AM
అదనపు కలెక్టర్ కె.కిరణ్మయి
శంషాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న యూనిఫాం స్టిచింగ్ సెంటర్ను అదనపు కలెక్టర్ డాక్టర్ కె. కిరణ్మయి గురువారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా యూనిఫాం కుట్టే విధానం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సిబ్బంది పనితీరును ఆమె పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
యూనిఫాం స్టిచింగ్ సెంటర్ నిర్వహణ, యూనిఫాంల నాణ్యత, నిర్ణీత సమయంలో కుట్టుపని పూర్తి చేసే విధానంపై సంబంధిత సిబ్బందితో చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలను నిర్ణీత సమయంలో అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్, సంబంధిత అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






