28 August, 2026 | 2:21 AM

విద్యార్థులతో పెట్టుకుంటే మనుగడ సాగించలేరు

28-08-2026 01:12 AM
  1. ప్రభుత్వానికి మాజీ గవర్నర్ దత్తాత్రేయ హెచ్చరిక
  2. విద్యార్థుల ఆగ్రహానికి గురికాకతప్పదు
  3. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
  4. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలి
  5. ఎమ్మెల్సీ సిరికొండ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ
  6. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నా

ముషీరాబాద్, ఆగస్టు 27(విజయక్రాం తి): విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను(fee reimbursement arrears) విడుదల చేయాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) హెచ్చరించారు. విద్యార్థులు(students) ఆత్మవిశ్వాసంతో విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ యన సూచించారు.

ఫీజు రీయింబర్స్‌మెం ట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో గు రువారం  హైదరాబాద్ ఇందిరాపార్కు ధ ర్నాచౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో దత్తాత్రేయ పాల్గొని మాట్లాడారు. వైఎస్ హయాంలో పూర్తిస్థాయిలో చెల్లించేవారని, ప్రస్తుత ప్రభుత్వం సగం మాత్రమే చెల్లిస్తుందని, అదీ కూడా 8వేల కోట్ల రూపాయలు బకాయిలో ఉన్నాయని తెలిపారు.

సీఎం నాణ్యమైన విద్యనందిస్తామని చెబుతూ, విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే పెండింగ్ బకాయిలను చెల్లించకుంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని దత్తాత్రేయ హెచ్చరించారు. దేశంలో కులగణన చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మె ంట్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మె ల్సీ సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు.

బకాయిలు చెల్లించకుంటే ప్రభుత్వం విద్యార్థుల ఆగ్రహానికి గురికాకతప్పదని, పెం డింగ్‌లో ఉన్న 42 శాతం బీసీల కోటా రిజర్వేషన్లు ఇవ్వాలని మాజీ మంత్రి వీ శ్రీని వాస్‌గౌడ్(Srinivas Goud), బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశా రు. ఈ ధర్నా కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంఘాల నేత లు పాండు యాదవ్, కోలా జనార్ధన్, నాగు ల శ్రీనివాస్ యాదవ్, పర్వతనేని సతీష్ బోయ గోపి, శివమ్మ, ఉదయ్ నేత, అరుణ్ యాదవ్, చీపురు మల్లేష్ యాదవ్, రా మ్మూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.