1 July, 2026 | 7:48 PM

Breaking News

బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •  

నాణ్యమెన ఏకరూప దుస్తులు అందించాలి

10-04-2025 12:28 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల, ఏప్రిల్ 9(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు జూన్ మొదటి వారం లోగా పాఠశాలలకు కేటాయించిన మేరకు నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, విద్యాశాఖ సమన్వయకర్త చౌదరిలతో కలిసి మండల విద్యాధికారులు, ఎ.పి.ఎం.లు, జిల్లా సమా ఖ్య, మెప్మా సభ్యులతో ఏకరూప దుస్తుల తయారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడుతుందని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, వంటశాల, భోజనశాల, ప్రహారీగోడ ఇతర మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు.

ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తు ల తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, మే 20లోగా దుస్తులు సిద్ధం చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులకు సంబంధించి దుస్తుల తయారీ కొరకు కొలతలు ఇప్పటికే తీసుకోవడం జరిగిందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీ కొరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఒక జత దుస్తులకు రూ. 75లు చెల్లించడం జరుగుతుందని తెలిపా రు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు హైదరాబాద్ లో అందించిన శిక్షణకు సంబంధించిన ధృవపత్రాలు అందజే శారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.