6 May, 2026 | 4:24 AM

ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యత్వం

10-12-2024 02:17 AM
  • జాబితాను విడుదల చేసిన బీజేపీ
  • తెలంగాణలో పార్టీ బలోపేతానికి నిర్ణయం

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాం తి): త్వరలో జరగనున్న రాజ్యసభ ఉపఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థుల పేర్లను ప్రకటి స్తూ సోమవారం జాబితాను విడుదల చేసిం ది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ ర్యాగ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్‌కుమార్ పేర్లను బీజేపీ ప్రకటించింది. గతంలో ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య 2024 అసెంబ్లీ ఫలితాల అనంతరం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వా నికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అనంతరం తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు, ఉపకార వేతనాలపై పోరాటం ప్రారంభించారు. ఈక్రమంలో బీజేపీ ఆయనకు మరో సారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. బడుగు, బలహీన వర్గాలను తమ వైపు తిప్పుకుం టే రాబోయే ఎన్నికల్లో రాష్ర్టంలో అధి కారం పక్కా అనే ఉ ద్దేశంతో బీజేపీ ఈ నిర్ణ యం తీసుకుందని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో మందకృష్ణ మాదిగతోపాటు ఆ సామాజికవ ర్గమంతా ఇప్పుడు బీజేపీ వెంటే నిలుస్తుందని.. కృష్ణయ్య రాకతో బీసీలు సైతం వెన్నుదన్నుగా ఉంటారని భావిస్తున్నారు.

కాగా ఆర్ కృష్ణయ్య మొదట టీడీపీ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓడిపోయా రు. అనంతరం ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు బీజేపీ తరఫున ఏపీ నుం చి రాజ్యసభకు వెళ్తున్నా.. కేంద్రంలో క్యాబినెట్ స్థాయి పదవి ఇచ్చి తెలంగాణలో పార్టీ బలోపేతానికి అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం.