పెస్టిసైడ్స్ కలిసిన టీ తాగి ముగ్గురు మృతి
10-12-2024 02:15 AM
* రాజస్థాన్‌లో ఘటన
జైపూర్, డిసెంబర్ 9: పెస్టిసైడ్స్ కలిసిన టీ తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈఘటన రాజస్థాన్‌లోని బన్వారా జిల్లా అంబపురాలో చోటుచేసుకున్నది. అంబాపురాకు చెందిన దరి యా (53), ఆమె కోడలు చందా (33), మనవడు అక్షయ్ (14)తో పాటు ఆమె భర్త, కుమారుడు మరికొందరు ఆదివారం తమకు తెలియ కుండా పెస్టిసైడ్స్ కలిసిన టీ తాగా రు. తాగిన కొద్దిసేపటికే వారంతా అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దరియా, చందా, అక్షయ్ మృతిచెందారు. మిగతావారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.






