20-05-2025 12:37:10 AM
నాని కథానాయకుడిగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. టైటిల్ టీజర్‌తోనే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేసిన ఈ సినిమా హై ఎనర్జీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోందని, పాత్రల నేపథ్యం బలంగా ఉంటుందని టీమ్ చెబుతోంది.
అందుకే డైరెక్టర్ శ్రీకాంత్ అందుకు తగిన నటీనటుల ఎంపిక చేసే పనిలో ఉన్నారట. పాన్‌ఇండియా మూవీ అయినందున నటీనటుల ఎంపిక కూడా ఆ స్థాయిలోనే నిర్వహిస్తున్నారట దర్శకుడు. ఇందులోభాగంగానే బలమైన ప్రతినాయకుడి పాత్ర కోసం రాఘవ్ జుయెల్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.
రాఘవ్ ఇంతకుముందు బాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘కిల్’లో తన హావభావాలు, ఆహార్యంతో మెప్పించాడు. శ్రీకాంత్ ఓదెలకు ఆ టైమింగ్ నచ్చడంతో ఇప్పుడు తన ‘ప్యారడైజ్’లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కథానాయికగా ఇప్పటికే కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసుకున్న చిత్రబృందం నాని తల్లి పాత్ర కోసం అన్వేషిస్తోంది.
ఇప్పటికే పలువురు సీనియర్ నటీమణులను సంప్రదించారని, మరాఠీ నటి సోనాలి కులకర్ణిని దాదాపు ఖాయం చేశారని సమాచారం. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రాఘవ్ లుక్ పోస్టర్, తల్లి పాత్ర సహా ఇతర పూర్తి వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉందట.