calender_icon.png 20 May, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యతో వెంకీ అట్లూరి సినిమా ప్రారంభం

20-05-2025 12:38:05 AM

విభిన్న చిత్రాలు, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. తెలుగులోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య చేతులు కలిపారు.

కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది సూర్య నటిస్తున్న 46వ చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ప్రేమలు’ చిత్రంతో యువతకు చేరువైన మమిత బైజు ఇందులో కథానాయికగా నటిస్తోంది.

ఈ చిత్రంతో రవీనా టాండన్ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; ఛాయాగ్రహణం: నిమిష్ రవి; కూర్పు: నవీన్ నూలి; కళా దర్శకత్వం: బంగ్లాన్; పోరాటాలు: వీ వెంకట్; నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య; రచనాదర్శకత్వం: వెంకీ అట్లూరి.