13-05-2025 01:19:53 AM
-కరాచీ బేకరీపై దాడికి మాకేం సంబంధం
-బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): కరాచీ బేకరీపై బీజేపీ దాడి చేసిందంటూ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు పేర్కొన్నారు.
ఇటీవల భారత్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజలు, బీజేపి నాయకులు, కార్యకర్తలు సైనికుల క్షేమాన్ని, దేశ విజయాన్ని కోరుతూ దేవాలయాల్లో పూజలు చేయడం, వివిధ ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపా రు. అదే సందర్భంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కరాచీ బేకరీపై దాడి చేశారని.. ఈ చర్యను బీజేపీ ఖండిస్తోందని తెలిపారు. ఈ ఘటనకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.